పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166 సాహిత్య మీమాంస

తాను మృతుడాయెను, రాజధర్మనిష్ఠుడై శ్రీరాముడు సీతను వనములకంపి తాను మృతప్రాయుడాయెను. తండ్రికి తగిన కొడుకు! తనభార్యకిచ్చిన వరములు దశరథుడు క్రమ్మరింప గలడు, కాని అట్లు చేయనొల్లడాయెను.

సత్యపాలన సామాన్యవ్రతము కాదు. బాసయిచ్చినది స్త్రీకైన నేమి, పురుషునకైన నేమి, దేవునకైన నేమి? అది నిల్పుకొనుటే సత్యవ్రతి కావశ్యకము, అదే ఆవ్యక్తికి జీవనము. సర్వసామాన్యములయిన విషయములందుకూడా యుధిష్ఠిరుని సత్యనిష్ఠ విదిత మగుచుండును. జూదమున రాజ్యసర్వస్వము నాత డోడెను - రాజ్యమే కాదు - ఐశ్వర్యము, సోదరులు, ధర్మపత్నియు పరుల పాలాయెను. పిదప పన్నెండేళ్ళు వనవాసము చేయుటకు పందెమొడ్డి అదీ వీగి అంతా విడిచి అరణ్యమున కేగెను. ఎందుకు ? సత్యవాక్పాలమున కేనా? ధర్మరా జొక ప్రతిజ్ఞ జేసెనా, దానికి భంగము రాకూడదు. ప్రపంచమంతా తారుమారైనా అత డన్నమాట తప్పడు. శ్రీరాముడు విజయ మొందిన ఆంతరికయుద్ధమును తుములముగా రచించుటకే వ్యాసుడు ద్రౌపదీవస్త్రాపహరణము కల్పించెను. అట్టి ఘోరయుద్ధమున కూడా ధర్మరాజు స్థిరుడై నిలిచెను. తనసర్వస్వ మొకకడ, సత్య మొకకడ నుండ ధర్మజుని మనమున యుద్ధము ప్రారంభించెను, అం దాత డచలుడై నిలిచెను. ఈయుద్ధమున స్థిరుడౌటచేతనే అతనికి యుధిష్ఠిరుడని పేరువచ్చెను. శత్రుసభయం దాతని సామర్థ్యము