పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165 వీరత్వము

బలముచేతనే వీరునకు వీరత్వము, మానవునకు మనుష్యత్వము సిద్ధించును.

రక్తపాతములేని సత్యపాలనము

సత్యవాక్పాలనమున ప్రతిజ్ఞాప్రాభవ ముంది. శ్రీరాముడు వనవాసదీక్ష గొని కొంచెమైనా జంకినాడా? పితురాజ్ఞా పాలనమే విధి అని యెంచిన ఆతనియందు తల్లిగాని, భార్యగాని, బంధువులుగాని, కులగురువుగాని యించుకైనా బిగువు తగ్గింపగల్గిరా? భరతుడెంత బతిమాలినాడు! శ్రీరాముడు వ్రతభంగము సల్పెనా? ఇట్టి దిట్టతనమునకు ధర్మనిష్ఠయే కదా కారణము! ఆనిష్ఠచేతనే రాజభోగములవీడి వనముల కేగెను. రాజ్యసుఖములు తుచ్ఛములని భావించుటలో నిస్స్పృహ, పదునాల్గేళ్ళు వనవాసము చేయుటలో చిత్త స్థైర్యమున్నూ స్పష్టము కాలేదా? సుఖము, కోర్కె, భోగమున్నూ విడిచిపెట్టుట అనితరసులభకార్యము కాదా? సత్యపాలనమున కిట్టి మనోదార్ఢ్యమే కావలయును. విధినిర్వర్తనమున శ్రీరాముని హృత్పాటవము కనవలెనంటే సీతను వనముల కంపునపుడు చూడండి - ప్రజాపాలనము చేయుచున్న రాజునకు తనకోర్కెల కొనసాగజేయు ఆవశ్యకత యెక్కడిది? తనసుఖములను త్యజింపవలయు, ప్రజలయానతి మన్నింపవలయును, అందుకే సీతనుకూడా పరిత్యజించెను. ఇదే రాజ నీతికి ఉత్కృష్టాదర్శము, అసమాన రాజధర్మము. కావుననే ప్రతిజ్ఞానిర్వహణనిష్ఠుడై దశరథుడు శ్రీరాముని వనముల కంపి