పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164 సాహిత్య మీమాంస

విడిచి యావజ్జీవబ్రహ్మచర్య మాచరింపలేదా? అర్జునుని వధింతునని కర్ణుడు ప్రతినపట్టిననాడు పాండవు లెంత గడగడ లాడిరి! ఆప్రతిజ్ఞ కోసమే బ్రహ్మాస్త్రము సంపాదింపవలెనని ద్రోణు నాశ్రయించి అవమానింపబడి మహేంద్రగిరినున్న పరశురామునికి శిష్యుడై పూనికతో నతని సేవించి, మెప్పించి ఎంతోకష్టముతో దాని నాతడు సంపాదించెను. అర్జునుడో, కర్ణుని వధింతునని ప్రతిజ్ఞచేసి శివునర్చించి పాశుపతమున్నూ దేవతల దర్శించి మరికొన్ని అస్త్రాలున్నూ సంగ్రహించెను. అభిమన్యువధానంతరము సూర్యుడస్తమించకుండా జయద్రధు (సైంథవు)ని చంపెదనని అర్జునుడు ప్రతిజ్ఞచేస్తే ఇరు వాగుల వీరులు మానసములూ తల్లడిల్లెను. అది నెరవేరకుండా కౌరవు లెంత ఆయోజన మొనర్చిరి! దుశ్శాసనుని గుండె పగులగొట్టి రక్త పానము చేయుటవల్ల భీముడు, ద్రోణవధచేత ధృష్టద్యుమ్నుడూ, ఉపపాండవుల జంపి అశ్వత్థామా నిర్వర్తితప్రతిజ్ఞులయినారు. ప్రతిజ్ఞాబద్ధుడౌటనే హంసధ్వజుడు తనకొడుకు సుధన్వుని కాగుచున్న నూనెలో తోసెను. ఈవిషయములం దెల్ల రక్తస్రావమున్నా మానవప్రతిజ్ఞాపాటవము స్థిరపడుచున్నది. ఇట్టిశక్తి వీరులయం దుండునంతవరకూ దేశము సురక్షితమని యెంచవచ్చును. పూర్వకాలపు క్షత్రియుల యందూ బ్రాహ్మణులయందున్నూ ఈశక్తి ప్రబలముగా ఉండేది. ఇప్పు డది సన్నగిల్లి పటిమ పల్చనైయింది - ప్రతిజ్ఞా