పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

163 వీరత్వము

మూలాన భక్తులభక్తి పరీక్షచేయబడడమేకాక భగవంతుని మాహాత్మ్యముకూడా ప్రకటింపబడును.

గ్రీకుసాహిత్యమందలి ధర్మబలికి పునర్జీవప్రాప్తి లేదు. అదుంటే నాటకము వియోగాంతము కాదు. వియోగాంత నాటకాలకు తుదను నిర్దయాజనితమైన రక్తపాతముండవలెను. దానివల్ల మనస్సులో దడపుట్టునా, లేక ధర్మగౌరవముచేత ఒళ్ళు పులకరించునా? వియోగాంతమున రక్తపాత మావశ్యకమా కాదా అనునంశ నిదివరకే చర్చింపబడింది.

వీరుని ప్రతిజ్ఞా బలము

ఆర్యుడు ధర్మరక్షణార్థము తనకు కర్తవ్యమయిన దొనర్తునని దృఢప్రతిజ్ఞ చేసి సంకల్పసిద్ధు డగును. బ్రాహ్మణులయొక్కయు క్షత్రియులయొక్కయు మనుష్యత్వమున కీ ప్రతిజ్ఞాబలమే నిదర్శనము. ఇట్టికార్యము లార్యసాహిత్యమున వేనవే లున్నవి. మానవునకు మనుష్యత్వమూ వీరునకు వీరత్వమూ సిద్ధించడమున కిదే మూలము. కర్తవ్యప్రతిపాలన మందు బ్రాహ్మణు డెన్నడూ పరాఙ్ముఖుడు కాలేదు. పితృభక్తిప్రేరితుడైన పరశురాముడు పితృవధప్రతిశోధప్రతిజ్ఞచేసి క్షత్రియరక్తమున పితృతర్పణ మొనర్చి కృతకృత్యుడయ్యెను. ప్రతినపట్టినవా రెంత దుర్ఘటమైన కార్యమైనా నెరవేర్చితీరుతారు; చెరనున్న సీతను ముక్తురాలను చేయడముకోసము శ్రీరాము డెన్ని అసాధ్యపు పనుల నెరవేర్చెను! తండ్రిని తనియింప ప్రతినపట్టి భీష్ముడు రాజ్యమును భోగములున్నూ