పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

161 వీరత్వము

రామ రావణయుద్ధము కురుక్షేత్రసంగ్రామము నిందుకు ప్రశస్తమైన దృష్టాంతములు. రక్తపాతమును తప్పించుటకు శ్రీరామునిపక్షమున అంగదుడూ, రావణునిపక్షమున విభీషణాదులూ, పాండవపక్షమున శ్రీకృష్ణుడూ కౌరవపక్షమున భీష్మాదిధర్మపరాయణలూ ఎన్నో ప్రయత్నములను కావించిరి, కాని అవి నిష్ఫలమాయెను. పోరుపొసగక సీతనొసంగనని రావణుడూ "వాడిములు మోపిమనంతైన వసుధ" నివ్వనని రారాజూ పట్టుబట్టిరి కావున యుద్ధ మావశ్యకమాయెను.

షేక్స్‌పియరునాటకమున యుద్ధమా కాలేదు, సీజరును వధించుట అత్యావశ్యక మూకాదు. అతని వధింప కాసియస్ మొదలగువారు దళబద్ధులై దృఢప్రతిజ్ఞ కావించుకొనిరి. వారి యుత్తేజనమునకు మూలమగు చిత్తవృత్తి యెట్టిది? "మనము చేసేపనిలో క్రోధముగాని హింసగాని ఉండరాద"ని బ్రూట సన్నాడు. ఆక్రూరకృత్యముపైని ధర్మమను తెరవేసి క్రోధమున్నూ హింసయూ దాచవలెనని బ్రూటస్ యత్నించెను. సీజరును ధర్మమునకు బలిగా నొసంగుచున్నామని జను లనుకొనవలెనని ఆతని తలంపు. ఆతని చిత్తవృత్తి స్వదేశాభిమానముచేత ఉత్తేజితమైనదట! కాసియస్‌మాటో? లోభహింసావేశులై ఆతడున్నూ మరికొందరు వీరులున్నూ సీజరును చంపదలచినారని బ్రూట సెరుగునా? ఎరుగడు. "ఎలాగో బ్రూటన్ మనలో కలిసినాడు. అతడేమి చేసినా చేయకపోయినా సీజరుచావు తప్పదు" అనుకొని కాపురుషు