పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

129 మానవప్రేమ

సంసారాంతర్వర్తి యగుట మనసాహిత్యా దర్శములందే కాంచనగును.

హిందూకుటుంబ నియమములు

ఆర్యసాహిత్యమున రచింపబడిన ప్రేమాదర్శముల యందు నాయికా నాయకులు పరస్పరమూ "నేను నిన్ను వలతును, దైవసాక్షిగా చెప్పుచున్నాను. నిన్ను తప్ప అన్యుల తలచను - ముమ్మాటి కిది నిజము, నీ వొకక్షణము కనబడకుంటే నాగుండె పగిలి ప్రాణములు నన్ను విడిచి పోవును." అని సంభాషించుట కానరాదు. ఇట్టి క్రయవిక్రయ సామగ్రిరూపమగు ప్రేమ హిందువులకు రుచించదు. తత్సంఘనియమానుసారము ఎవరి కేది కర్తవ్యమో, వారు దానిని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించుటచేతనే యావత్స్నేహము, మమత, దయ, దాక్షిణ్యము, భక్తి, ప్రేమయు ప్రకటితము లగును. వివాహభారము మాత్రమే పెద్దలది, కాని తదనంతరమున భార్యాభర్తలు ఎవరికర్తవ్యమునకు వారు మనసార పూనుకొందురు. రూపపిపాస ఇంద్రియలాలసయు చరితార్థమొనర్చుటే ఆర్యవివాహమునకు ముఖ్యోద్దేశముకాదు గనుక పెళ్ళి వధూవరుల వశమున నుండదగదు. పతియాజ్ఞకు సతి సతియాజ్ఞకు పతిబద్ధులై యుండవలెనను కుటుంబనియమమునకు వారినిద్దరినీ బద్ధులను జేయుటకే వివాహము సృజింప బడినది; నీతిదాయకమూ ఉభయతారకమూ నగు ఈసంసార శృంఖలమున వారిని త్వరగా బద్ధులను చేయడమునకు పెద్దలు