పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

127 మానవప్రేమ

అవమానవహ్ని పరితప్తయగు యాజ్ఞసేని భీమార్జునులపై దీనదృష్టులు సారిస్తూన్నది, ఐనను భ్రాతృభక్తి, ధైర్యము, ఆత్మనిగ్రహమును కోపాంబునిధికి చెలియలకట్టయై వారి సర్వాంగముల నరికట్టుటచే ద్రౌపది అనాథయై

               శ్లో|| "హా కృష్ణా ద్వారకావాస క్వాసి యాదవనందన?
                     ఇమా మవస్థాం సంప్రాస్తా మనాథాం కిము పేక్షసి?"

అని మొరలిడుచు భగవంతుని శరణువేడ ఆత డామె మానమును సంరక్షించెను. ఈదృశ్యమందలి ఆత్మనిగ్రహ మింకొకదేశసాహిత్యమున గాంచనగునా?

ఆర్యసాహిత్యమున నిట్టి ఆదర్శము లెన్నో కలవు. వాటియందలి ప్రేమభక్తి సమున్నతము, స్నేహార్ద్రము. సీత ప్రేమ పతిభక్తియందు విలీనమగుటచే ఆమె చేసిన చేతలు, ఆడినమాటలును పతిభక్తిద్యోతకములు, అట్టిభక్తి అదృష్ట శ్రుతపూర్వము. భరతునియందును లక్ష్మణునియందును దోచున దిట్టిభక్తి యనవచ్చు. "ఉత్తర రామచరితము"న ప్రథమాంకమున సీత ప్రేమయు భక్తియు నిరూపించ బడినవి. తృతీయాంకమున శ్రీరాము డాప్రేమచే కాతరు డగును. సీతావియోగానంతరము తత్స్వర్ణ ప్రతికృతినే ధర్మపత్నిగా నిల్పి మనోవ్యాధిగ్రస్తుడై కాలము పుచ్చునపుడు ఆప్రేమయే ఆతనికి జీవాధారము. చతుర్థాంకమున కౌసల్యా జనకులప్రేమ కనబడును. ఈరీతిగా సీత వనమందున్నా కుటుంబప్రేమ తరంగములలో తేలియాడుచుండుటచే ఆప్రేమ