పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79 దివ్యప్రేమ

చిన్న పుస్తకముల ద్వారా ఈధర్మముల నన్నిదిక్కుల వ్యాపింపజేస్తున్నారు.

3. వ్రతములు - నోములు.

పుణ్యకథల రచించుటతోనూ వినుటతోనూ తనివితీరక పిల్లలచే ఆధర్మముల నాచరింప జేయుటకు ఋషు లనేకవ్రతములను నిర్మించిరి. సత్యభామా సావిత్రియూ ఎట్టివ్రతముల నాచరించి పతిపూజ ప్రతిష్ఠించినారో వాటినే మనవారిప్పటికీ చెప్పుకోవడమే కాక తామాచరించి కోడళ్ళచేతను కూతుళ్ళ చేతను ఆనోములు పట్టిస్తూన్నారు. ప్రతివ్రతము నోము తుదనొక కథ యుండును. అందు కొనియాడబడునవి పైరెండు ధర్మము లే.

4. దృష్టాంతములు

బోధనచేయడమే కాక తామాతీరున ఆచరిస్తూన్న పెద్దలు దృష్టాంతరూపులై బాలకులచిత్తములందు ధర్మ ప్రవృత్తి పాదుకొల్పుచున్నారు. ఈధర్మములను వట్టి బోధన వల్ల సాధించుట దుష్కరము, ఇందు దృష్టాంతములే ముఖ్య సాధనములు.

ఇన్ని రీతుల ఉపాయములచేత స్త్రీలకు మనపూర్వులు విద్యనేర్పుతూండిరి. ఇదే యోగ్యమైన బోధన. ఈవిద్యా ప్రభావముననే మనస్త్రీల కనేక సుగుణములు అలవడుచుండేవి. విదేశ శిక్షాప్రచారములేని చోట్ల ఈశిక్షా ఫక్కియందలి ఫలము నేటికిన్నీ తెల్లమగుచున్నది. సతీత్వపాతివ్రత్యగౌర