పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80 సాహిత్య మీమాంస

వోజ్వలమగు పౌరాణిక సాహిత్యమును పఠించుటవల్లనే అట్టి సుగుణము లలవడును, కాని విదేశీయగ్రంథముల చదువుటచే ఎన్నడును అబ్బవు. ఇట్టివిద్య కథలు వినుట, దృష్టాంతములు కనుట, ఆచరణముల చేయుట వలన లభించునంత సుళువుగా వట్టి గ్రంథపఠనము వలన లభింపదు. ఈనాల్గుసాధనముల చేతను తరుణతరళములగు మన కులకామినుల హృదయములందు పాతివ్రత్య సంస్కారము వేరుదన్ని నిలుచును. తన్మూలమున వారు ధర్మగౌరవమున మదిన్నిల్పి తమ జీవికను సార్థకమొనర్చుకొందురు.

పై నుదహరించిన ఆర్యశిక్షాప్రణాళి కాలవశమున తారుమారయి, ప్రస్తుతమున ఆ సుందరపథమునకు మారుగా విదేశశిక్షాపరిపాటి ఉపక్రమింపబడుతూన్నది. ఆసాహిత్యమున మన సతీత్వపతివ్రతాధర్మములు లేక పోవడమేకాక తద్వ్యతిరేక రీతి కాన్పిస్తూంది. పతిప్రేమరసాయనము గ్రోలుతూ తదేకనిష్ఠతో జన్మమంతా గడుపుట భారతీయసతికి విధి. పాశ్చాత్యసంఘమునం దిట్టి ఆదర్శము లేదు. వారి ఆదర్శ విధానము కొంచెము వివరింతాము -

1. వారిలో స్త్రీలు తమ కిష్టమైన వారిని పెండ్లి యాడుదురు, వారి యిచ్ఛప్రబలము, తదనుసారము కార్యముల నిర్వర్తింతురు; వారికి స్వాతంత్ర్యమూ స్వేచ్ఛయూ ఉన్నవి.

2. వారిలో స్త్రీలు పలుమారు పెండ్లి యాడ