పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78 సాహిత్య మీమాంస

ఆర్యకవు లనేకోపాయముల తమ సాహిత్యమున జొన్పినారు చూడండి : _

1. పురాణశ్రవణము - పాటలు

మనదేశమున పురాణశ్రవణము లోకులకిప్పుడు రుచింపకున్నా అచ్చటచ్చట ఇది చెలగుచుండ బట్టి మధురవాక్యములతో కూర్పబడిన దృష్టాంతసహిత వ్యాఖ్యానముల యందును, వీధులలోనూ ఇండ్లలోనూ పాడుచున్న పాటలు, వింటూన్న హరికథలు, గీతములూ, కనుచున్న వీధినాటకములు బొమ్మలాటలు మొదలగు వాటియందున్నూ కీర్తింపబడు సతీధర్మము, పాతివ్రత్యప్రభావమును స్త్రీల మానసము లందు గాఢముగా నాటి వారి జీవితముల శుభోదర్కము లగునట్లు ఒనర్చుచున్నవి. శ్రీమద్రామాయణము మహాభారతమును నాటకములుగాను పాటలుగాను రచింప బడుటచేత కొంతవర కీ ఫలమే సిద్ధిస్తూన్నది. వీటిని విన్నతరువాత పతితపావనమగు నిర్మలధర్మప్రవాహము మానసములందు పారుచునే ఉంటుంది. గాయకులు, నటులు "కాలక్షేపముల" చేయువారును వివిధశబ్దార్థాలంకారముల కూర్చి వారివారి వాక్చాతురి, కళాకౌశలమున్నూ వెలయునట్లు ఈరెండు ధర్మములను అధికముగా ప్రకటిస్తూన్నారు.

2. ఇళ్ళలో చెప్పుకునే కథలు.

మనలో వృద్ధులు (స్త్రీపురుషులు) అనుశృతిగా కథలు చెప్పుతూ పాటలుపాడుతూంటే చదువుకొన్నవాళ్లు చిన్న