పుట:Pranayamamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాసనము *[1]

ఎడమమడమను కుడితొడ మొదటను, కుడిమడమను ఎడమతొడ మొదటను పెట్టుము. సుఖముగా కూర్చొనుము. కుడివైపుకుగాని ఎడమవైపుకుగాని వంగకుము. దీనిని సమాసనము అందురు.

మూడు బంధములు

ఇవి నాల్గురకములు. సూర్య, ఉజ్జయి, సీతలి, బస్తి. కుంభకమును ప్రారంభించ బోవునపుడు యోగి యగువాడు ఈ మూడు బంధములను చేయవలెను. మొట్టమొదట మూలబంధము, రెండవదిగా ఉడ్యాణము, ఆ పిమ్మట జాలంధరములను చేయవలెను.

గుదమును గట్టిగా పైకిలాగి బిగబట్టుటవల్ల క్రిందివైపుకు ప్రవహించుచుండెడి అపానము పైకి ప్రవహించును. దీనిని మూలబంధము అందురు. ఈ అపానమును పైకి అగ్నివుండెడి చోటునకు ఈ లాగునచేసి పంపుటవల్ల, అగ్ని ప్రజ్వలించి పెద్ద మంటగలదిగా అగును. అందువలన వేడిపుట్టును. ఈ అగ్ని శరీరమున మంటలు మంటలుగ వ్యాపించి ఆ వేడిచే నిద్రించుచున్న కుండలినీ శక్తిని మేల్కొలుపును. అప్పుడు ఆకుండలినీ శక్తి దెబ్బతినిన త్రాచువలె బుసకొట్టుచులేచి సుషుమ్నా రంధ్రములో ప్రవేశించును. కావున యోగులు ప్రతినిత్యము

  1. * ఆసనములను గురించి పూర్తిగా తెలసికొన గోరువారు నాచే రచింపబడిన ‘సచిత్ర యోగాసనములు’ చదువుడు.