పుట:Nanakucharitra021651mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూడ నానకుయొక్క ప్రియభక్తుడగు బలుడే చెప్పి వ్రాయించుటచేత బయలుదేరినవి. బలుడు గురువుతో గూడ దిరిగినను విద్యాగంధశూన్యు డగుటచే తను మూడవిశ్వాసముగలవాడగుటచేతను గ్రంథకర్తలకు గురువు వృత్తాంతమును చెప్పునప్పుడు నిజమగు వృత్తాంతములను సరిగ జెప్పలేక తన పిచ్చినమ్మకముల నందు జొనుపుచు చాలకాలము గడచినపిదప చెప్పుటచే సరిగా జ్ఞాపకములేక తన మందమతికి స్ఫురించిన వన్నియుం దెలుపుచు గురుచరిత్రమందలి యీభాగమును సంశయాస్పదముగ జేసెను. మూడవకారణ మిది. గురుచరిత్రము వ్రాయునప్పటికి గురువు మృత్యుడయ్యెను. అతని కీర్తి యార్యావర్తమందంతట వ్యాపించె. ఎన్నో మహిమలు వాని కారోపింపబడెను. ఎన్నోయద్భుతములు వానింగూర్చి చెప్పుకొనబడెను. చరిత్రకారులు వానిమహిమలు వినినవారే గావున తాము వినినవి చుట్టుప్రక్కలజనులు చెప్పుకొనునవి యగులోకసామాన్యచరియలతో బుస్తకములనింపిరి. ఆగ్రంథములలోనున్న విశ్వాసపాత్రములుకాని యంశములు విడిచి వానియాత్రలు కొన్ని వర్ణింతుము.

ఆతండు గంగాతీరమునం బయనముచేసి వంగదేశమునకు వచ్చెను. అచ్చట కొంతకాలముండి పిదప నత డాసామునకు బోయి యచ్చట ననేకమాసములుండెను. ఈపయనములతో మర్దనుడు మిక్కిలి డస్సి తన గురువువలె భక్తితత్ప