పుట:Nanakucharitra021651mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుడై మార్గాయాసము మరచుటకుగాని బలునివలె వైరాగ్యము గలిగి శ్రమకోర్చుటకుగాని సమర్ధుడు గాకపోయెను. అస్సాముదేశమున సంచరించుచుండ నానకు షేకుఫరీదను మహమ్మదీయ యోగియొక్క వంశస్థుడైన యొకతురకం గలుసుకొనెను. వారిరువురు గొన్నినాళ్ళు గలిసియుండి భగవద్విషయము లనేకములు చర్చించిరి. వారెడబాయునప్పుడు మతద్వేషములు లేక యొండొరులం గౌగిలించుకొని విషాదముతో వేరైరి. ఆసామునుండి గురు వోడ్రదేశమునకు బోయి జగన్నాధక్షేత్రమును దర్శించి యచటి యాలయమునం దర్చకులు పండాబ్రాహ్మణులు నిత్యకృత్యములలో జేయు నకార్యములం జూచి యేవగించెను.

జగన్నాధక్షేత్రమునుండి నానకు దక్షిణదేశమునకు బోయి యందనేక దివ్యస్థలముల సందర్శించి యక్కడనుండి సింహళద్వీపమునకుం జనెను. ఈగురువు వెళ్లునప్పటికి సంహళద్వీపమును శివనాధుడను రాజు పాలించుచుండెను. తన దేశమునకు మువ్వురుక్రొత్తమనుష్యులు వచ్చిరనియు నందు సామాన్యసన్యాసులకు బోలని యొక విరాగి గురువై యుండెననియు శివనాధరాజు విని వాని జూడగోరెను. కోరి యాతనిం జూడబోవుటకుముందు వాని ప్రజ్ఞ యెట్టిదియో జగద్వంచనము సేయవచ్చిన మాయయోగియో నిజమైన సన్యాసియో వాని మనోనిశ్చలత యెట్టిదో కనుగొని యనంతరము వాని