పుట:Nanakucharitra021651mbp.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దర్శనమునకు బోవలయునని రాజు నిశ్చయించుకొని పంచభక్ష్యపరమాన్నములతోనిండిన యన్నమును, విలువగల చీనిచీనాంబరములను సొగసుకత్తియలగు పడుచుకన్నియలను యోగికి గానుకగా బంపెను. గురునానకు మొదటి రెండు వస్తువుల జేతితో ముట్టక కన్నియలం గన్నెత్తిచూడక నిరాకరించుటయు నవి తోడ్కొనిపోయినవారు వచ్చినదారినే భగ్నమనోరధులై పోయిరి. తన కావించిన పరిక్ష గురునందలి గౌరవముబెంప రాజు స్వయముగ నానకును సందర్శింపవచ్చి యంతటి మహాత్ముని రాకచేత తనరాజ్యము ధన్యమైనదని కొనియాడెను. ఆమహారాజుచేసిన యాదరణమునకు సంతుష్టుడై కాబోలు నానకు సింహళద్వీపమున రెండుసంవత్సరముల యైదుమాసములుండెను. ఆదీవివెడలిలాతిభూములకు నానకు పయనమైనప్పుడు మర్దనుడు నిరంతరప్రయాణములచేత విసికి గురువును విడిచి యధేచ్చం జనియెను. అట్లు మర్దనుడు గురువును బాసిపోయినను కొంతకాలము వాని నెడబాసియుండునప్పటికి వాని కేమియుం దోచక పిచ్చియెత్తినట్లుండుటచే గురువు పిలువకపోయినను తనంతట తాను వచ్చి నానకును గలిసికొనెను.

అనంతరము గురునానకు లోకానుభవజ్ఞానము సంపాదింప భరతఖండమునకు జుట్టుప్రక్కలనున్న యనేక మ్లేచ్ఛ దేశములకు బయనము చేసెను. ఆయన చూచినట్లు జెప్పబ