పుట:Nanakucharitra021651mbp.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డు పరంజ్యోతి తనలోనే వెలుగుచుండును. తనలో నీశ్వరతేజము ప్రకాశించుచున్నట్టు తెలిసికొనుటయే యోగము."

అనంతరము నానకు సిద్ధమఠము విడిచి గంగానది ప్రవహించెడు భూములలో సంచారము చేయదలచి పయనమయ్యెను. ఈయాత్రాచరిత్రలు సత్యమునకు దూరములై యద్భుతములతో మహిమలతో నిండిన కల్పనాకథలై యున్నవి. నిజమైన చరిత్రము నిమిత్తము నానకునుగూర్చి వ్రాయబడిన ప్రాచీనగ్రంథములను మన మెంతవెదకినను నూటి కొకచోట నెక్కడనో యొక సత్యమైన వృత్తాంతముండును గాని తక్కిన దంతయు బృహత్కథలోనున్న కథలకన్న నెక్కుడు చిత్రకల్పనలతో నిండియుండును.

ఆచరిత్ర లట్లుండుటకు మూడు ముఖ్యకారణములు గలవు. అందు మొదటిది. ఆచరిత్రలు వ్రాసినవారు భూగోళ శాస్త్రమేమో యెఱుగరు. వారు జన్మమధ్యమున స్వదేశమగు పంజాబు నప్పుడప్పుడు చూచియుందురు; కాని గంగానది ప్రవహించెడి దేశములనుగాని యచ్చట నివసించు జనులనుగాని వారెన్నడు జూచి యెఱుగరు. ఏస్థలముల జూడక స్థిమితముగా నిండ్లవద్ద గూర్చుండి విన్నకథల నాధారములు చేసికొని చరిత్రలువ్రాయు గ్రంథకతన్ లంతకంటె నెక్కువగ నేమివ్రాయగలరు. రెండవకారణమిది. ఆచరిత్రలీయాత్రలు జరిగిన ముప్పదియేండ్ల తరువాత వ్రాయబడినవి. ఆవ్రాతలు