పుట:Nanakucharitra021651mbp.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునందు నేతెగయందు జేరుట లేదనియు జెప్పెను. అట్లుపలికి నానకు వారికాసమయమున గొన్ని నీతివాక్యముల నుపదేశించినట. అవి భాషాంతరమునం దుండుటచే వానితాత్పర్య మీక్రింద బొందుపరచుచున్నాడ. "కాషాయాంబరము దండము ధరించుటలోను మేనెల్ల బూడిద పూసికొనుటలోను యోగములేదు. సిరస్సు ముండనము చేయించుకొనుటలోను శంఖము లూదుటలోను యోగము లేదు. లౌకికాకర్షణములచేత జుట్టబడియు మనుష్యుడా యాకర్షణములకు లోబడక వాని కతీతుడై యుండుటలో నిజమైన యోగమున్నది. వట్టిమాటలవల్ల నిజమైన యోగమురాదు. ఈశ్వరుని సర్వవ్యాపకత్వ మెవ్వడు తెలిసికొనువో యతడే యోగి. యోగము మనస్సులోనేకాని దానికి వెలుపల లేదు. యోగము గోరీ దిబ్బలలో లేదు. యోగము శ్మశానములలో లేదు. ఈశ్వరైక్యము చెందుచున్నామని దొంగమూర్ఛలు బడుటలోలేదు. నానాదేశముల కరిగి తీర్థములందు మునుగుటలోలేదు. లౌకికాకర్షణములకు లోబడక వాని కతీతుడై యుండుటలోనే యోగము కలదు. మన యాదిగురువగు పరమేశ్వరుని దెలిసికొంటిమా సర్వసంశయములు నివారణములగు. అంతట ముక్తి కరతలామలక మగును. భగవద్విషయమును దెలిసికొనగోరువాడు ముందుగా మనశ్శాంతి సంపాదింపవలయును. మనస్సు తన యిష్టమువచ్చినట్లు దిరుగుటమాని నిశ్చలమైనప్పు