పుట:Nanakucharitra021651mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నానకు శిష్యసమేతుడై యాస్థలమునకుబోయి సిద్ధాశ్రమమున కెదురుగా నొక నారింజచెట్టుక్రింద గూర్చుండె. ఆకిచ్చలిచెట్టదివఱకు జాలకాలమునుండి శోషించి మోడుగానుండెనట. గురువు దానిక్రింద నాశీనుడైనతోడనే యావృక్షము పచ్చనియాకులు లేతచిగుళ్ళు గలిగి దర్శనీయ మయ్యెనట. ఈవింత దూరమునుండి సిద్ధులు గనిపెట్టిరట వారు తమకంటె నెక్కువయోగులు లేరని కడుగర్వితులై యుండువారట. తమకంటె నెక్కువ మహిమలుగల మహాత్ములు వచ్చెనని తెలిసికొని యాసిద్ధులు నానకు చుట్టుంజేరిరి. జోగులు పదిమంది జేరినప్పుడు వేదాంతచర్చ తప్ప మఱియొకవిషయమేది చర్చింపబడును? ఆసిద్ధులు తమకు దుస్సాధ్యములగు వేదాంతవిషయకప్రశ్నముల నెన్నో గురువు నడిగిరి. గురువు దేనిలోను వారికిం దీసిపోవడయ్యె. సిద్ధులడిగిన ప్రశ్నలకన్నిటికి గురువవలీలగ మనస్సునకు దక్షణమే నాటునట్లుగ ననుభవసిద్ధమగునట్లుగా బ్రత్యుత్తరములు చెప్పి యందఱను సంతుష్టుల జేసెను. అంతట నాసిద్ధులు నానకు తమకంటె నెక్కువ సిద్ధుడని గ్రహించి వానిం గొనియాడి తమమఠమున జేరుమని ప్రార్థించిరి. నానకు దానికి సమ్మతింపక మనుష్యున కాత్మశుద్ధి సత్ప్రవర్తనము మొదలగునవి యుండవలయును. గాని పై వేషములవలన లాభములేదనియు వేషధారణముతో బనిలేక యంత:కరణశుద్ధికై పాటుపడవలయుననియు తానేమత