పుట:Nanakucharitra021651mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నానకు చరిత్ర.

సప్తమాధ్యాయము.

ఇంతవఱకు నానకు దేశాటనమని చెప్పదగిన సంచారము చేయలేదు. అతడు తిరిగిన యూళ్ళు రెండు మూడు మాత్రమే గలవు. అందు మొదటిది సుల్తానుపురము. రెండవది యమ్నాబాదు గ్రామము. ఈయూళ్ళకు బోవునప్పుడు మార్గవశమున నత డొకటిరెండు గ్రామములు చూచియుండవచ్చును. అతని శరీరము వానిమనస్సువలెనే స్వేచ్ఛావిహార మందాసక్తిగల దగుటజేసి యతనికి దేశాటనమునందు మిక్కిలి యిష్టముండెను.

బలమర్దనులు వెంబడింప నట్లు తాల్వెండి గ్రామము విడిచి నానకుముందుగా యమ్నా బాదునకు బోయెను. అచ్చట పూర్వశిష్యుడగు లల్లో వాని నాదరించి పదునైదు దినములు తనయింట నుంచుకొనెను. అటనుండి గురువు తత్సమీపమందున్న మఱియొక తావునకు బోయెను. ఆస్థలమునకిప్పుడు నానకు మఠమని పేరు. ఆకాలమందచ్చటగాడనియమములతో యోగాభ్యాసము జేయునట్టి సిద్ధులనేకులుండిరి. గురు