పుట:Nanakucharitra021651mbp.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనగునని వానికుపదేశము చేసెను. నానకు స్వగ్రామములో నున్నపుడచట చెరువులేనందుకు మిగులవిచారించుచువచ్చెను. గ్రామస్థులు దానివలన జాల నిడుమలు బడుచువచ్చిరి. రాయబులారు గురువు నిర్ణయించిన ధర్మకార్యము సర్వజనోపయోగమైదని శ్లాఘించి తగినతావు వెదకి చెరువు త్వరలోనే ద్రవ్వించి దానికి గురునానకు పేరుపెట్టెను.