పుట:Nanakucharitra021651mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్వకమగు నుపదేశము జరుగుచుండెనుగాని విశేషజనులకు వినోదముదీరుట తప్ప నెక్కువయుపయోగము లేకపోయెను. గ్రామమువిడిచి పోదలచినప్పుడు వానిని మిత్రులు జుట్టములు తలిదండ్రులు చుట్టుకొనిరి. తల్లిదండ్రులు సన్యాసాశ్రమమును విడువుమని చాలబ్రతిమాలిరి. రాయబులూరు సయితము తలిదండ్రుల పక్షముబూని వ్యాపారమేమియుం జేయనక్కఱలేదనియు నూరక స్వగ్రామమున నుండినంజాలు గావున దానికైన నియ్యకొనదగుననియు నానకును వేడుకొనెను. అందుకు నానకు తద్విషయమున దనయిష్టము చెల్లదనియు దనయిష్టమే చెల్లినపక్షమున జననీజనుకులను మెప్పించుటకంటె మరియొక కార్యము తనకు లేదనియు దనయిష్టముకంటె నతీతమైన పరమాత్మునియిష్టమెట్లో నట్లు జరుగవలసినదనియు బదులుచెప్పెను.

అట్లు చెప్పి బలమర్దనులు వెంబడింప గురువు ప్రయాణోన్ముఖుడైయున్నపుడు రాయబులారు వానిసమీపమునకు బోయి తనకొక ధర్మకార్యము జేయ నిష్టముగలదనియు నెయ్యది యుత్తమోత్తమ కార్యమగునో గురువు నోటనుండి విన వేడుక గలదనియు జెప్పెను. పరోపకారము జేయదలచిన సత్పురుషునకు నిరుత్సాహము జేయుట భావ్యముగాదని గురువు వాని మంచితలంపునకు సంతసించి తాల్వెండి గ్రామములో మంచిచెరువు లేనందున మంచినీళ్ళతటాక మొకటి త్రవ్విం