పుట:Nanakucharitra021651mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రిందియుత్తరము వచ్చెను. "నీవు మనసార భగవంతుడను సర్కారును గొలువుము. నీయాత్మభగవన్నామము మీది భక్తిని వృద్ది పొందించునట్లు నడుచుకొనుము. నీయధికార మంతయు దోషములమీద జూపి దానిని నశింపజేయుము. అట్లుచేయుదువేని నీవు సిద్ధుడవగుదువు."

నానకునకు బినతండ్రికి జరిగిన సంభాషణము విని రాయబులారు నానకుయొక్క మనస్సునకు నిష్టముగా నుండు నట్టి పని వానిచుట్టములు చెప్పలేదనుకొని తాను చేయబోవు నుపదేశము తప్పక యంగీకరింపబడునని నమ్మి గురువుతో నీవిధమున బలికెను. "బీదవాండ్రకు నీవొకసత్రమును వేయుము దానిఫొషణకు గావలసిన ధాన్యమంతయు బండదగిన మంచిభూమి మూడునూతులుగలది నేను నీ కిచ్చెదను. నీవు శిస్తురూపకముగా నాకేమియునీయనక్కఱలేదు." ఇది సత్కార్యమగుటచే సాధారణముగ నానకుమెత్తబడి దానికొప్పుకొన వలసినదే. కాని యాతని మనోనిశ్చయము దృడమైనదగుటచే నతడు పార్వా పర్వములు విచారించి దానికి సమ్మతింప లేదు. ఇదియేగాదు ఎవ్వరెంతెంత మంచి యుపదేశముల జేసినను నానకు మనస్సున కవి యెక్కవయ్యె. అట్లు కొన్నిదినములు తాల్వెండిలోనుండి నానకు యెట్టకేల కాయూరువిడిచి పోదలచెను. ఏలయన నతడచ్చట నున్నందువలన బారమార్థిక చింతగల కొంతమందికే జ్ఞానోపదేశపూ