పుట:Nanakucharitra021651mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇకనాలస్యము చేయక నీజీవితకాలమునే యంగడి చేసికొనుము. భగవన్నామమె యాయంగడిలో నమ్మెడు సరకుగా నేర్పరచుకొనుము. ధ్యానమె యాసరకును సంపాదించు సాధనముగ నుంచుకొనుము. ఈశ్వరనామవ్యాపారము చేయు వర్తకులతోనే బేరసారముల జేయుచు గాలము గడపుము. ఇంతకన్న వేరు వతన్‌కము చేయకుము" అట్లు పలికిన కొడుకుమాటలు విని పినతండ్రి వెండియు నిట్లనియె "నీకంగడి పెట్టుట కిష్టములేని పక్షమున విదేశములు చూడ నభిలాష గలిగినపక్షమున గుఱ్ఱములవతన్‌కము జేయుము. అది కారణముగా నీవెన్నో దూరపుపట్టణముల జూడగలవు" నానకు దానికిట్లు బదులు చెప్పెను. "నీవు శాస్త్రములను వినెడు వ్యాపారమునుండి సత్యమను గుఱ్ఱములను దూరదేశములకు దీసికొనిపోయి యమ్ముము. నీదారిబత్తెముగ సత్కార్యములు సౌజన్యత గొనిపొమ్ము. ఆవ్యాపారమువల్ల నీకుగలుగు లాభమేమన నీవక్షయలోకమున కఱిగి నిరాకారుడగు నీశ్వరు సాన్నిధ్యమునుజేరి మోక్షసుఖము ననుభవింపగలవు" జ్ఞానియగు కుమారుడన్ని విధముల నిహలోక వ్యాపారమురోసి బ్రహ్మజ్ఞానబోధకములగు పలుకులు పలుకుచుండ పినతండ్రి వాని నెంతమాత్రము గ్రహింపలేక సిగ్గులేక మరల నిట్లనియె. "పోనీ నీకు గుఱ్ఱపువతన్‌క మిష్టములేదేని సర్కారు వారివద్దనుద్యోగములో జేరుము." ఈమాటకు గురువు నోటినుండి ఈ