పుట:Nanakucharitra021651mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాది సద్గుణములే తనమిత్రములనియు దెలియజేసెను. అప్పు డాతనిపలుకులు వినినవా రందఱు వాని నిశ్చలభావమునకు సంతసించి యతడు గృహస్తాశ్రమమును సంపూర్ణముగ విడిచినాడనియు జితేంద్రియుడై యాశల జయించి సంసార సంబంధము ద్రెంపినాడనియు వానిచరిత్రము ముందుముందు సుజనవందితమై యుండుననియు నమ్మిరి. కష్టతరమైన మాతాపితృసందర్శన మీవిధమున బరిణమించినందుకు తన మనోధైర్యము వ్రీలకుండ దాను బయటబడినందుకు నానకు మిక్కిలి సంతసించెను.

"మాతృదేవోభవ, పితృదేవోభవ" యని వేదములు పలుకుచున్నవిగదా సమస్త మతములు తలిదండ్రులసేవ యుత్తమోత్తమమని యంగీకరించు చున్నవిగదా! అట్టియెడ తలిదండ్రులకు విధేయుడైన నానకు తన యకాల సన్యాసము వల్ల వారికిరువురకు నధికమనోవేదన నేల గలిగింపవలయు? తల్లిదండ్రుల దు:ఖపెట్టినయతడు గురువగునా యని కొందఱడుగవచ్చును. స్వలాభము నెంచుకొని తల్లిదండ్రులను విడుచువాడు దూష్యుడగును గాని లోకాను గ్రహార్థము గృహము దారపుత్రులను మాతాపితలను స్వలాభమును స్వసౌఖ్యమును బరిత్యజించి యేకాకియై సుజనులు చుట్టములుగ జ్ఞానులు సహకారులుగ శిష్యులు బిడ్డలుగ లోకమే యిల్లుగ భగవంతుడు తండ్రిగ భావించి పాపుల నభ్యుద్ధరింప బాటుపడి