పుట:Nanakucharitra021651mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్పెను. అనంతరము దండ్రి కుమారునితో సభాషింప దలప నానకు పినతండ్రి లోకవృత్త మెఱిగినవాడయినందున గాళుడు మాటలాడ మొదలుపెట్టు నేని వానివాక్పారుష్యము వలన దండ్రికొడుకుల కదివఱకే గలిగిన వియోగము మఱింత యధికమగునని వానిని మాటలాడ నీయక తానే ముందు ప్రసంగమునకు దొరకొనెను. అన్నకొడుకును బినతండ్రి పలుకరించి ముందుగా స్వగృహమునకు రమ్మని నానకును బిలిచెను. నానకు వానికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "అయ్యా! నా యిల్లు వేరుగ నున్నది. మీయిల్లు నాయిల్లు గాదు. అన్ని యిండ్లతో సంబంధము వదలుకొంటిని." కొడుకిచ్చిన యీయుత్తరము చెవినిబడిన తోడనే త్రిప్తాదేవి, పుత్రస్నేహమితరాలోచనలను జయింప మనసు పట్టలేక వలవల యేడ్చుచు గుమారుని పాదములపై బడెను. మాతృవిధేయుడగు నాగురువు తల్లిని పరమ భక్తితో బాదములపైనుండి లేవనెత్తి వినయమున నిట్లనియె. "అమ్మా! క్షమయేనాకు దల్లి సంతుష్టియే నాతండ్రి మనోజయ కారణమయిన సత్యమే నాపినతండ్రి.

ఆయుత్తరము మిక్కిలి ప్రశంసనీయ మైనదిగదా? గురునానకు తన యెట్టయెదుట నున్న బంధువులు బంధువులుగారని విస్పష్టముగ జెప్పి దీనబంధువుడగు భగవంతుడే తన బంధువుడనియు వాని సన్నిధానమునకు గొనిపోవందగిన