పుట:Nanakucharitra021651mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నియు భావించి తప్పక యా యూరికి బోయి తన మనోధైర్యమును బరీక్షించుకొన దలచేను. అట్లు కృతనిశ్చయుడై యిరువురు శిష్యులచేత నను గమ్యమానుడై నానకు తాల్వెండికి బోయి గ్రామము బ్రవేశింపక యూరుబైట చెరువు వద్ద బస చేసెను.

అతని రాక గ్రామములో దెలిసినతోడనే గ్రామవాసులు స్త్రీలు పురుషులు బాలురు వ్య్ద్ధులు దమతమ పనులు కట్టి తమ గ్రామవాసియైన యామహాయోగి దర్శనము చేయ తీర్థప్రజలె వచ్చిరి. నానకు మనసులో తలంచినట్లె తండ్రియగు కాళుడు తల్లి త్రిప్తాదేవి పినతండ్రులలో నొకడు వానికడకు వచ్చిరి. అప్పుడు నానకు సన్యాసి వేషముతో నుండెను. కాషాయవణన్‌ముగల రెండుగజముల గుడ్డ తలకు చుట్టుకొని యట్టిదే మఱియొకటి మొలకు జుట్టుకొని మఱియొక చిన్నగుడ్డ చేతబూని యతడు గూర్చుండెను. ఊరుబైట చెట్టుక్రింద నట్టిదీన వేషముతో గూర్చుండిన యాకుమారుని జూడ తల్లితండ్రుల మనసెట్లు పరితపించెనో చదువరులే యూహించుకొన వచ్చును. కాళుడు కుమారుని నీచస్థితి జూచినతోడనే మనోవైకల్యము నొంది కోపపరవశుడై నానకును దూషించుటకు బ్రయత్నించెనుగాని శాంతస్వభావుడగు వాని తమ్ముడక్కడనే యున్నందున మనస్సు స్వాధీనములో నుంచుకొమ్మని సోదరునకు హితోపదేశము చేసి వానిసంరంభమును మా