పుట:Nanakucharitra021651mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క మనోధైర్యమును జిక్కబట్టిన బట్టుగాక! మూతీన్‌భవించిన కృపారసమో యన్నట్లు మృదువులగు మాటలతో, జాలిగొల్పుచూపులతో బాష్పపూరితములైన కన్నులతో దరికిజేరి మీద చెయివైచి తల్లి బ్రతిమాలుకొన్నప్పు డెంతనిశ్చలహృదయముగల కొడుకైన బేలవడి లోబడకుండునా! సహజముగ మాతృభక్తి యతిశయముగా నున్న నానకువంటి గుణవంతుడు తల్లిమాటల కెదురాడగలడా? మాటకు మాట యుక్తికి యుక్తి చెప్పి యతడు తొక్కినమార్గము సరికాదని సహేతుకముగా నెవరైన వాదించినచో వారి నతడు వాదమున నోడింపగలడు. అట్లు చర్చలు పెంచక వాదములు సలుపక కన్నీళ్ళనే యుక్తులుచేసికొని దయనీయములగు మాటలనే యాయుధములుగ జేసికొని కొడుకులం గెలిచి వారిమనస్సులం ద్రిప్పదలచు తల్లులముందఱ పుత్రుల నీమములు నిలుచుట యరిది. ఇందుచేతనే పూర్వకాలమునందు గౌతమబుద్ధుడు మొదలగు మహాత్ములందఱు సన్యసించి యా యాశ్రమమునందు జాలకాలము స్థిరపడినపిదప తల్లిదండ్రులు మొదలగు చుట్టములం జూడబోయిరి. అవి యన్నియు నానకు చక్కగా నెఱిగినవాడు గావున తాల్వెండికి బోవుదునా మానుదు నా యని మొదట నించుక సంశయించియు జననీజనకుల బ్రార్థనలకు మనోవైకల్యము నొందక స్థిరముగా నిలిచినప్పుడే తన వైరాగ్యము వైరాగ్యమగుననియు గానిచో నది వ్యర్థమ