పుట:Nanakucharitra021651mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేనులు ధారవోయునట్టి మహాత్ములు తలిదండ్రులకు మనోవేదన గలిగించి నంతమాత్రమున దూష్యులుగారు. ఈతండ్రి దు:ఖించినను బైనున్న యాతండ్రి:వాని గుణములకు సంతసించును. ఈపుత్రులు తగు జీవనాధారము లేక స్వల్పకాల మిడుమలు బడినను శిష్యపుత్రులు వేనవేలు సద్గతులు గలిగి సుఖింతురు. బుద్ధదేవుడు తలిదండ్రులమాట సరకు సేయక సన్యసించె. శంకరాచార్యుడు తల్లికన్నిష్టమైనను వివాహపూర్వమందె నాలవయాశ్రమము స్వీకరించెను. రామానుజాచార్యుడు కాపురమునకు వచ్చిన భార్యను విడనాడి భగవత్సేవకై త్రిదండ సన్యాసియయ్యెను. బసవేశ్వరు డుపనయనమే చేసికొననని గురులమాట ధిక్కరించెను. పురాణములలో నిట్టి యుదాహరణము లనేకములు గలవు. శుకుడు బాల్యముననే సన్యసించి తండ్రియగు వేదవ్యాసునకు మిక్కిలి మన:ఖేదము గావించెను. ప్రపంచారంభమునుండియు లోకోప కారులై మహాత్ములు గురువచనంబుల నతిక్రమించియే లోక బంధువులైరి. మాతాపితల శాసనము లతిక్రమింపగూడనివని వారు గృహములందుండిన మానవలోకము గతియేమి కావలసియుండును?

అట్లు నానకు తల్లియొక్కయు బిన తండ్రియొక్కయు మాటల నిరాకరింప బిన తండ్రి కాలునితో నాలోచించి రాయబులారు మాట మీద దమకుమారునకు గౌరవముగలదని