పుట:Nanakucharitra021651mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ను శేజిఖాను వానివంటి యితరమనుష్యులు నిశ్చయముగా నట్లు గడపిన దినములు కొన్నియుండెను. అదృష్టము కలిసివచ్చినంతకాలము వారికట్లు జరిగెను. కటకటా వారిప్పు డెట్లున్నారు. శత్రుసైనికు లున్నసొమ్మెల్ల నొలుచుకొనిరి. ఈయా యవమాన మనక యెల్ల యవమానములు వారివంతయ్యె. వెనుక ననుభవించిన మహాభోగములకన్నిటికి బ్రాయశ్చిత్తమో యన్నట్లు కొందఱు మహాభారముగ నున్న సంకెళ్ళతో గాళ్ళు కదపలేక నేడో రేపో గతించిన తమ చెలికాండ్ర గలిసికొనుటకు సంసిద్ధులై చెరసాలలలో గుందుచున్నారు. భగవంతుడు న్యాయశీలుడు సర్వోన్నతుడు. అతనిశాసన ముల్లంఘించినవారు తప్పక నశింతురు. ఈనాటిప్రభువులగు పటానులు వానియాజ్ఞ దాటలేదా దానిఫల మనుభవించుట లేదా? ఘాతుకులగు మొగలాయి సైనికులకు బౌరువహీనులయిన పటానుప్రభువులకు జరిగిన యాయుద్ధములో నిరహేతుకముగా జచ్చిన వేనవేలు పురుషులు స్త్రీలు బిడ్డలు మొదలగువారిపక్షము బూనుట కెవ్వరు లేకపోయిరి.