పుట:Nanakucharitra021651mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రువులు స్మరియింప నియ్యరు. కొందఱు చెల్లాచెదరైన తమ కుటుంబముల సేమము నరయుచున్నారు. కొందఱుచుట్టపక్కముల కుశలవాతన్‌ల నడుగుచున్నారు. కొందఱు తమ దుష్కర్మములఫల మనుభవింప గూర్చుండినట్లు నేలగూర్చుండి యేడ్చుచున్నారు. భగవంతు డేమిచేయ నిచ్చగించునో యదియే సంభవించును. మనుష్యుడు చిన్న "పురుగు."

అట్లు ప్రజల యవస్థనుగూర్చి కొన్నిపద్యములు చెప్పి నానకు పట్టణపరిపాలకుడగు శేజిఖానుని దుర్గతిని వణిన్ంచుచు మరికొన్నిపద్యములు రచించె. ప్రతిపద్యాంతమందు భగవంతుని మార్గము మనుష్యబుద్ధికి దుర్గమములనియు నతని శాసనము లవిలంఘనీయము లనియు నానకు నొక్కిచెప్పుచు వచ్చెను. ఆపద్యముల తాత్పర్య మీక్రింద వ్రాయుచున్నాడ. "ఒక కాలమందు శేజిఖాను వాని యంత:పురాంగనలు ననుభవించిన భోగ మింతింతయని చెప్పరాదు కదా! సేవకులు వారికనుసన్నలమెలంగి వారి నోటమాట జారినమాత్రమున నూడిగములు చేయుచువచ్చిరిగదా! కోరికలు కోరుటయె తడవుగా నవి నిఫలము లయ్యెనుగదా! అహోరాత్రము లెడతెగని పండుగలై మహోత్సవములతో నిండియుండెనుగదా! ఆనందసముద్రమున దేలుట సౌఖ్యములనవ్వారిగా ననుభవించుట సేవకుల కాజ్ఞాపించుట యాటలాడుట యలంకారముల జేసికొనుట మున్నగుపనులకంటె నన్యమెఱుంగరుకదా! అవు