పుట:Nanakucharitra021651mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లు దృష్టితీసిరోగదా! వారినోట మాట వచ్చెనా లెక్కలేని ధనము వారియధీనమయ్యెనుగదా! హంసతూలికాతల్పముల మీద హాయిగా బన్నుండుటయెగాని పనిచేసి యెఱుంగరుగదా. కావలసిన సమస్తమధురఫలములు వారికవలీలగ జేకురుచుండెడివి. ఆ యువిదలు శరీరములమీద ధరియించిన చీనీచీనాంబరములు మణిభూషణములు వెలలేనివిగదా! కటకటా ఇప్పుడు వారి చక్కదనమె వారికి శత్రువయ్యెను. వారివిభవమె విరోధియయ్యెను. దురాత్ములగు యధికారుల యాజ్ఞాప్రకారము సైనికులా స్త్రీలంజెరబెట్టిరి. దైవము తనకిచ్చవచ్చిననవారి నున్నతపదవికిం దెచ్చి కాపాడును. మనుష్యుండు తగుసమయమున భగవంతుని దలచుకొన్నయడల వారికపాయములేల వాటిల్లును. శత్రువులు దండువిడియకముందు ప్రభువులు భోగపరాయణులై దైవమును మఱచి నిశ్చింతతో నుందురు. ఇప్పు డేమి విచారించిన నేమిఫలము? బేబరు శాసనము చెల్లుచున్నది. సుకుమారవతులగు సుందరాంగులు సయితము పట్టెడన్నమునకు మొగము వాచియుండిరి. మసీదులలో నమాజుచేయవలసిన యవసరము దేవాలయములలో బూజలుచేయవలసిన యవసరము లేకపోయినది. హిందూసుందరులు మనసార మొగమున గుంకుము బొట్టుబెట్టుకొనుటకైన వీలులేని కాలము వచ్చినది. మునుపు వీరెవ్వరు రామునిపేరైన స్మరియించి యెఱుగరు. ఇప్పుడు స్మరియింపదలచినను శ