పుట:Nanakucharitra021651mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగుసైనికులు చేయదగిన దుండగములన్నియు జేసిరి. ఒక్క ద్రోపుడుకాదు. ఒకహింసకాదు. ఒక్కస్త్రీ మానహానిగాదు. అపుడుజరిగిన దౌర్జన్యములను గురునానకు స్వయముగ జూచియుండుటచేత నతడు స్వభాషలో నాపురజనుల దురవస్థ గొన్ని పద్యములలో వణిన్ంచెను. ఆపద్యముల తాత్పర్య మీక్రింద బొందుపరచెద. ఈ వాక్యములలో నత డంత:పుర స్త్రీల దురవస్థనే మిక్కిలి వర్ణించియున్నాడు.

"ఆహా యీస్త్రీలు మున్ను పువ్వులతో సుగంధతైలముతో నగలతో వారిశిరసుల నలంకరించుకొని యుండిరికదా. ఆయువతు లిప్పుడు శిరస్సులు ముండనముచేయించుకొని నోట మట్టిగొట్టుకొని పోవుచున్నారుగదా! తొల్లి యీ యంగనలు సుందరమందిరముల వసియించుచుండిరిగదా! నేడు వారిజయించిన వారియెదుట నిలువనైనదగరట. వందనముసర్వేశ్వరా వందనము. నీసంకల్ప మెవ్వడెఱుంగడుగదా! నీవేమి చేయదలంచెదవో నీవ యెరుంగుదువు. ఈపడంతులు వివాహకాలమున భర్తృపార్శ్వమున నెంతెంతశోభిల్లుచునుండిరోగదా! వివాహానంతరమున నీవెలదులు పల్లకులెక్కి భర్తృగృహములకు బోయినప్పు డెంతెంతవైభవముతో నుత్సవములు జరిగెనొకదా! చేతుల కంకణాలు ధగధగ మెరయ నీక్రొత్తపెండ్లికూతు లత్తవారి గుమ్మములముందు నిలిచినప్పుడు ముసలిముత్తయిదువులు పీడాపరిహారార్థ మెన్నిపారు