పుట:Nanakucharitra021651mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవుడు తలంచున దొకటియు దైవము నిర్ణయించున దొకటియు నగుచుండునుగదా. శేజిఖాను తనయధికారబలమున భాగో చెప్పిన యాలోచనము ననుసరించి పట్టణమునంగల విరాగులనెల్ల బలవంతముగ బట్టి తెప్పించెనేకాని తనయభిప్రాయము వారికి సరిగ నెఱింగింపక మున్నె కుమారుని శరీరస్థితి వారికి దెలుపకమున్నె యంతలో మొగలాయీలు మహాసేనాసమేతులై జయభిలాషమై వచ్చుచుండురనియు వెంటనే తమకు లోబడని పట్టణంబుల భస్మపటలము చేయుచు మనుష్యుల మ్రందించుచుండిరనియు గుండెలవియు వార్తలు తెలిసెను. లోబడని పట్టణములు భస్మపటలము లగుచున్న వనుటచేత లోబడినయూళ్ళు నిరపాయములై యున్నవని తలంపవలసినపని లేదు. నీతిమాలిన యాదండులోని సైనికులు లోబడిన యూళ్ళసైతము దోచుకొని స్త్ర్రిల జెరబట్టియధేచ్ఛముగా మెలంగుచువచ్చిరి. ఎట్లయినను వారియధికార మొప్పుకొన్నగ్రామము లొప్పుకొనని గ్రామములకంటె నించుక సుఖతరములుగ నుండినవని చెప్పవచ్చును. ఆవార్తలు విని శేజిఖాను వానిచుట్టములు మిత్రులు తక్కిన పట్టణములకు బ్రాపించిన దురవస్థయే తమ పట్టణమునకుగూడ తప్పక పట్టునని మహాపదకు సంసిద్ధులైయుండిరి. అనుకున్నంతపని జరిగె. బేబరుయొక్క మొగలాయిసైనికులు కొలదికాలములోనే యమ్నాబాదునకుబోయి యనాగరికులు క్రూరులు