పుట:Nanakucharitra021651mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నానకు చరిత్ర.

షష్ఠాధ్యాయము.

మర్దనుడు గురువును వీడ్కొని తాల్వెండీగ్రామమునకు బోయెను. ఆగ్రామవాసులు వానిరాకకు సంతసించి నానకునుగూర్చి మిక్కిలి యాత్రముతో నెన్నోప్రశ్న లడగజొచ్చిరి. మర్దనునకంటె ముందు పదునైదుదినముల క్రిందట బలుడు తాల్వెండికిబోయెను. నానకుతండ్రి యదివఱకే తన కుమారుడు సన్యాసులలో గలిసిపోయినాడని విని యామాట నిజమో యబద్ధమో కనుగొనుటకు బలునికడకుబోయెను. అది యదార్థమే యని బలుడు పలుకటయు భగ్నమనోరధుడగు కాళుడు కాళునికంటె నెక్కుడుగ ద్రిప్తాదేవియు మితిలేని నగపునొందిరి. కాళుడు పుత్రస్నేహము కతమున మనశ్శాంతి గోల్పోయి నిరపరాధుడగు నాకాపుకొడుకును జూచిన చోటనెల్ల దిట్టుచు దనకుమారునిపాలిటి దుష్టగ్రహమనియు దన కొంపదీసిన వాడనియు దు:ఖింపజొచ్చెను. కాళుడు, పుత్రుని దెస నాస విడిచియు మరల నతడు సంసారమును స్వీకరింపడని మనంబున నెఱింగియు నెవరిప్రోత్సాహముచేతనైన బలుడు విడిచిపోయినపిదప బుద్ధిమంతుడై సం