పుట:Nanakucharitra021651mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాని తెచ్చిన యాహారమును దిన్నగ మెసవక వడ్రంగి యిడినకూడు నెక్కువయాదరించి సమగ్రమముగ భక్షించి యుండుననుట సత్యమని మనమూహింపవచ్చును. ఇంతియగాక గడుసుదనమెఱుంగని వెంగిలిజనులను దోచికొను భాగ్యవంతులగువారి యన్నముకంటె నీతి మంతులగు నిరుపేదల కూడు శ్లాఘ్యము గ్రాహ్యమునని నానకు మొగమోటమిలేక వానితోజెప్పియుండిన నుండవచ్చునని గూడ మనమూహింపవచ్చును. అయాదరణము నాధారము జేసికొని బుద్ధిమంతులీ కథను గల్పించి యుందురు. భాగ్యవంతుడై యెల్లవారలకు గౌరవనీయుడైనున్న భాగోకు నిరుపేదయు దక్కువ వర్ణము వాడునందు వడ్రంగియునగు లల్లో యెదుట జరిగిన యవమానము నతడు సాధారణముగ మరచిపోదగినదిగా గానబడదయ్యె. ఆక్రోధమతడు మనసులో నుంచుకొని నానకున కేదైన నపకారము జేయుటకు సమయము నిరీక్షించు చుండెను. రం ధ్రాన్వేషణము చేయువారికి సమయములు చిక్కకపోవునా శీఘ్రకాలములోనే యతని కొక యదునుదొరకెను. ఎమ్నాబాదు ఖిల్లాదారు (గవర్నరు) గానుండిన శేజిఖానున కొక్కడే పుత్రుడుండెను. అతడా దినములలో గొప్ప జాడ్యముచే బీడితుడైయుండె. శేజిఖాను గొప్పవా డగుటచే నతడు తన యధికారమునకు లోబడిన దేశములోనున్న గొప్పవైద్యుల నందఱ బిలిపించి కుమారునకు జికిత్సముల జేయించెను కాని