పుట:Nanakucharitra021651mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనయింటనున్న నిస్సారపదార్థములం గొన్నిటిని దెచ్చి గురు సమ్ముఖమునం బెట్టె. పెట్టుటయు గురువు రెండుపళ్లెరముల నుండి రెందువస్తువులు చెరియొక చేతం గ్రహించి వ్రేళ్ళతో నొక్కెనట. నొక్కినతోడనే భాగో తెచ్చిన పదార్థముల నుండి నెత్తురుబొట్లు పడెనట. లల్లో సమర్పించిన పదార్థములనుండి తెల్లని పాలు గారెనట. అట్లు కారుట యసంభవమగుటచే నీకథ విశ్వాసపాత్రముగాదు. కాకున్నను లోకులకీ కట్టుకథ కొంత నీతిని బోధింపకపోదు. ఇందు మనము నేర్చుకొనవలసిన నీతి యిది. సంపన్నులు వెండిగిన్నెలతోడను బసిడిపళ్లెరములతోడను దెచ్చియిచ్చు పంచభక్ష్యపరమాన్నంబులు వారి కష్టార్జితంబులు కావనియు, పొట్టగడువక దినమెల్ల జమటయూడ్చి పాటుపడు నిరుపేద లనేకుల బాధించి బలాత్కారముగాను మోసపుచ్చియు సంపన్నుల ధనము గ్రహించి విందుల తామారగించి యొరులకు మెప్పునకై పెట్టుదురనియు, పాలుమాలక యొరుల వంచింపక మేను దాచుకొనక పాటుపడిదారపుత్రుల నెట్టెటోబోషించుచు గౌరవముగ గాలక్షేపము చేయువాని గంజియన్నమే భాగ్యవంతుల పాయసాన్నములకంటె భక్ష్యములకంటె మహాత్ము లెక్కువ యాదరముతో నెక్కువరుచితో భూజింతురనియు మన మెఱుంగవలయు.

భాగోతెచ్చిన పదార్థములనుండి నానకు నెత్తురు పిండినమాట నిస్సంశయముగా నతిశయోక్తియైయుండును. గాని