పుట:Nanakucharitra021651mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడైనందున నిరువుర కన్నమిడుట వానికి భారముగా నుండు నేమోయనియు, బోవదలచిన వాని నాప గూడదనియు నానకు మర్దనుని పోక కనుమతించి నెల దినములలో ననగా దానాపురము విడువకముందే రమ్మని చెప్పిపంపెను.

గురు నానకు తత్పురమున నున్నప్పుడు సంపన్నుడు పలుకుబడి కలవాడు కులమున క్షత్రియుడునగు మాలికు భాగోయనునతడు బ్రాహ్మణులకు సంతర్పణము జేసినాడు. నానకునుగూడ విందునకు బిలిచెను. ఏమి కారణముచేతనో నానకు విందునకు బోవలేదు. ఆసంపన్నుడది యనుమానముగా గ్రహించి నానకు దర్శనమునకుబోయి విందునకు రాకపోవుటచే దనకుగలిగిన యవమానమును మనస్తాపమును బిట్టుగజెప్పుకొనెను. అదివిని నానకు భాగోనుచూచి యంతటి స్వల్పవిషయమున కంతగా విచారింపవలసిన యావస్యకత లేదని చెప్పి వెనుక విందారగింపనందుకు దోషపరిహారార్థముగా నప్పుడతడిచ్చు వస్తువుల దినుటకు వాగ్దానముచేసి భక్ష్యముల దెమ్మని యడిగెను. భాగో సంతుష్టహృదయుడై తక్షణము కొన్నిభక్ష్యముల దెమ్మని సేవకున కాజ్ఞాపించెను. తోడనే మిగుల రుచ్యములగు పదార్థములు పళ్లెరములతో వచ్చెను. అవి ముట్టకమునుపే నానకు ప్రక్కనునిలిచియున్న పేదవడ్రంగినిజూచి మీయింటిపదార్థముల గూడ తీసుకుని రమ్మనియాజ్ఞాపించెను. అనవుడు లల్లో మహాప్రసాదమని