పుట:Nanakucharitra021651mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిచ్చెను. ఆమె దానిని బుచ్చుకొనుట కిష్టము లేనిదయ్యు దమ్ముడేమను కొనునోయను భయమున మరల గ్రహించి గృహస్థాశ్రమము స్వీకరించి తల్లి దండ్రులకు నాలు బిడ్డలకు దనకు బావకు నత్తవారికి నెప్పటియట్లు నేత్రానందము గలుగ జేయదగునని వానిని బ్రార్థించెను. ఎన్ని చెప్పినను నానకు తనత్రోవ విడువనందున నానకీదేవి తమ్మునిం జూచి "నాకు నిన్ను జూడవలయునని బుద్ధి పుట్టినప్పుడు నేను నీకు వర్తమాన మంపెదను. నీవు తక్షణము వచ్చి నన్నుజూచి పోవలయు" నని కోరెను. నానకు సోదరి కోరికను దప్పక తీర్చుట కొడంబడెను.