పుట:Nanakucharitra021651mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నానకు చరిత్ర.

పంచమాధ్యాయము.

అనంతరము నానకు కొంతకాల మచ్చటనుండి సోదరివద్ద బావవద్ద సెలవుగైకొని లాహోరు మండలము నందలి యమ్నాబాదు పట్టణమునకు బయనమైపోయెను. సుల్తానుపురమునువిడిచిన యాగడియ మొదలుకొని యీకథానాయకుడు గురు నానకు నామముతో వ్యవహరింప బడుచువచ్చె. ఏలయన నాదినము ప్రారంభముగా నతడు తనకాలమున సంఘమునందు ప్రబలియుండిన దురాచారమును వెలిపుచ్చి ఖండించుటకును బ్రజల మనస్సులనుండి మూడవిశ్వాసములను దొలగించుటకును సత్యమని తానునమ్మినమతము స్వేచ్ఛగా లోకులకు బోధించుటకును సంకల్పించెను. ఏమనుష్యుడు తన బోధనలవలన మానవకోటికి నీతి యాత్మజ్ఞానము మనోవికాసము గలిగించునో యతడే గురుశబ్దమున కర్హుడు. నానకు తనకు గలిగిన యాత్మజ్ఞానమును దోడిమానవులకు నెఱింగించుటకే గాక దైవధర్మములకు విరుద్ధములైన దురాచారము