పుట:Nanakucharitra021651mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండదలతువేని యాకలిచేత దప్పికచేత బాధపడవలసి యుండును. నానకుతో నున్నవారికి నానకుతోపాటు కష్టములేగాని సుఖములు లభింపవు" మర్దనుడా పలుకులు విని యేమియుం బదులుచెప్పక యెటుచేయుటకుం దోచక సందిగ్ధ మనస్కుడై యుండెను. అంతలో మర్దనుడు తన తమ్ముని విడిచి పోవదలంచుకొన్నాడని విని నానకి విచారమొంది మర్దనుని బిలిపించి పోవదలచిన కారణమడిగి తమ్ముని విడిచి పోవలదనియు సుల్తానుపురములో నున్నంతకాలము తనయింటనే రెండుపూటలు భుజియింప వలసిన దనియు సోదరుడాయూరు విడిచిపోవునప్పుడు వానివెంట బోవలసినదని యీ ప్రయాణమున కగు కర్చులన్నియు తానే యిచ్చుకొనబూను ననియు జెప్పి యిప్పుడే రెండుబట్టలు నిరువది రూపాయలు వాని కిచ్చెను. అది పుచ్చుకొని మర్దనుడు వారు చెప్పినట్లె చేయుటకు వాగ్దానము చేసి మరల నానకు కడకుంబోయెను. మర్దనుడు కనబడకపోవుటచే నతడు స్వగ్రామమునకే బోయి యుండవచ్చునని నానకు తలంచి వానిం జూచినతోడనే మరల నేలవచ్చితివని యడిగెను. మర్దనుడు నానకీదేవి తన్ను బిలిపించి చెప్పినమాటలన్నియు వాని కెఱిగించెను. మర్దనుడు తన సోదరివద్దనుంచి వస్త్రములు గ్రహింపవచ్చునే కాని ధనము స్వీకరించుట యనుచితమని తలంచి నానకు వానివద్దనున్న ధనము దీసికొని సోదరివద్దకు బోయి యామెధనమామె