పుట:Nanakucharitra021651mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగవతోత్తముని మనోధైర్యమెట్లుండునో చూచితిరా? లోకము తనమాట నిరాకరింపక వినయముతో వినునుని వాని యంతరాత్మ విస్పష్టముగ వానికి జెప్పెను. భగవద్భక్తులకు సామాన్యమనుష్యులకు గల ముఖ్యభేద మిదియే. అనంతరము నానకు కొంచెము యోచించి సుల్తానుపురమునకు సమీపమందున్న యొక గ్రామములో నొక వతన్‌కుడు పెహురూయనువాడు తాంబురాలు చక్కగా చేయగలడనియు వాని కడకు బోయిన దొరకుననియు జెప్పి మర్దను నంపెను. మర్దనుడు బయలుదేరి నానాస్థలములు దిరిగి యామనుష్యుని నెలవుగానక మూడుదినములు తిరిగితిరిగి మిక్కిలి డస్సి యొక చెట్టుక్రింద గూర్చుండ వానివద్దకే పెహురూ వచ్చి యొక తాంబురా యిచ్చెనట. మర్దనుడు దాని వెల యీయబోవ దాని నతడు పరిగ్రహింపక నానకుదరిశనము చేయింపుమని ప్రార్థించెను. మర్దనుడను వానిందోడ్కొని నానకునకు జూపి త దభీష్టముం దీర్చెను.

మర్దనుడు గానవిద్యలో నానాటివారి నందరిని మించెనని చెప్పుదురు. తాంబురా దెచ్చి సృతివేసి యతడు తుహినిరాకార్ తుహినిరాకార్ నానక్ బందా తేరా యను పల్లవిగల కృతి పాడెను. పాడినతోడనే నానకు భక్తిరసపరవశుడై యెడలెఱుంగక పడియెను. మర్దనునకు గానమునందధికప్రజ్ఞ మొదట లేదనియు నానకు వరప్రసాదమునకు నిము