పుట:Nanakucharitra021651mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకము నుద్ధరింపదలచిన మహాత్ము లొక్కచోట నెప్పుడు నుండరు. తాము బుట్టిపెరిగినచోటులను వ్యవహారములు చేసినచోటుల మొదలే యుండరు. తమకు భగవంతు డిచ్చిన జ్ఞానము లోకమంతట వెల్లడిచేయుటయే వారి ముఖ్యోద్దేశము గావున మహాత్ములు నిరంతరము దేశాటనము చేయుచుందురు. నానకుగూడ జగదుపకార పారీణుడగుటచే మర్దనుడు తన శిష్యుడైన కొన్ని నాళ్ళకు సుల్తానుపురము విడిచి మఱియొకతావునకు బోవదలచెను. మర్దనుడు మంచిపాటకుడగుటచే నిరంతరము భగవన్నామ కీర్తనము గానరూపమున వానినోటనుండి వినవచ్చునని నానకు తాంబురా కావలయునని కోరి యదికొనుటకైన దనవద్ద ధనము లేనందున దానికి వలయు ధనమిమ్మని సోదరివద్దకు వర్తమాన మంపెను. తమ్ముడట్టి కోరిక కోరుటయే చాలునని నానకిదేవి తక్షణమే వానికి గావలసిన ధనమిచ్చి సోదరు నొకసారి జూడగోరి యెటులైన వచ్చిచూచి పొమ్మని ప్రాథన్‌వపూర్వకముగా వర్తమాన మంపెను. నానకు తనయక్కమాట త్రోసివేయలేక యామె దర్శనమునకు బోయెను. నానకి తమ్మును మిక్కిలి గారవించి భోజనముపెట్టి చాలసేపు వానితో సంభాషించెను. అక్కడ నుండగానే నానకు పూర్వపు చెలికాడగు బలుని జూడగోరెను. నానకి వెంటనే వానిని రావింప నతడు వానిం జూచి నీ వెట్లున్నావని యడిగెను. బలుడప్పలుకులు విని యజమానుడు తన్ను విడిచిపోయినది మొదలు