పుట:Nanakucharitra021651mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొట్రుపడి యతిత్వరితమున నింటికిబోయి యావాతన్ బార్యకెఱగించెను. ఆమెతన సహజధైర్యమునుజూపి భతన్‌జెప్పినమాట సరిగా నమ్మలేదు. జయరాముడు తనమాట భార్యసరిగా నమ్మకపోవుటచే నిజస్థితి గనుగొని రమ్మని నాధుడను బ్రాహ్మణుని నానకువద్ద కంపెను. ఆబ్రాహ్మణుడు తక్షణమే బోయి యధార్థస్థితి దెలుసుకొని నానకు తురకలలో గలిసినమాట యబద్ధమనియు నానకు నవాబుమాటలోబడి యట్టిపనిచేయువాడు కాడనియు జెప్పెను. అదివిని జయరాముడు భార్యయు మిక్కిలి సంతసించిరి.

నానకు విరాగులలో గలిసినవార్త కాళునకు జాలకాలమునకుగాని తెలియదయ్యె. తాల్వెండి గ్రామమునకు సుల్తానుపురమునకు కొన్నివందలమైళ్ళ దూరమున్నందున నాదినములలో వతన్‌మానము దెలియుట చాలకష్టముగ నుండెను. పూర్వము పొరుగూరి వాతన్‌లు దెలియవలెనన్న గృహస్థుడు పురోహితునో యింటి మంగలినో యింటి పాటకునో లేక బత్తెమిచ్చి ప్రత్యేకముగా నొక మనిషినో పంపవలయును. కుమారుని వార్త కాళున కెట్లెట్లో తెలిసెను. ఆవాతన్ వినగానే కాళునిప్రాణములు నిలువునంబోయెనని చెప్పవచ్చును. త్రిస్తాదేవి దు:ఖ మింతింతయని వర్ణింప నలవిగాదు. ఆమెభర్త తన దు:ఖము గోపావేశముచేత నడుమనడుమ మరచుచువచ్చె. త్రిప్తాదేవి శాంతమున భూదేవియే కోపమెట్టిదో