పుట:Nanakucharitra021651mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొట్టమొదట దానున్నట్లు ధర్మమే చేయుమని నొక్కిచెప్పెను. నవాబు నానకు నడిగిన కార్యములేదని తెలిసికొని వానిం బంపివేసి యాధనము సగము నానకు మనోరధ ప్రకారము పేదలకు పంచిపెట్టి సగ మాలుబిడ్డల కిచ్చెను.

ఈనాటి హిందువులకు వలెనె యానాటి హిందువులకు గూడ జాతి మతవర్నసంబంధములయిన పట్టుదలలు మిక్కుటముగనుండెను. మనదేశము నిప్పుడు క్రైస్తవులు పరిపాలించుచున్నట్టె యప్పుడు మహమ్మదీయులు పరిపాలించుచుండిరి. ప్రభువులు మహమ్మదీయ మతస్థులయినను దేశస్థులు హిందూమతమునే యవలంబించి విడువక యభిమానముగలవారై యుండిరి. తురకలు హిందువులు పలుమారుత్సవసమయములగలియుచు వచ్చిరిగాని కలిసి తినుట వియ్యమందుట మొదలగు వానిలో మాత్రము హిందువులు గలియరైరి. హిందువుడు, మసీదునకుబోయి తురకలంగలసి నమాజు చేయుట స్వమత మరియాదం దాటుటగా నానాటివారు భావించుచు వచ్చిరి. అట్టివాని నానాటివారు వెలివేసిరేగాని వర్నములో నుంచరైరి. నానకు మహమ్మదీయులతో గలిసి మసీదులో బ్రార్థనచేసి స్వమతమరియాద నతిక్రమించెను. నవాబు ఖాజీవాని వెంటబెట్టుకొని పోవుటంజేసి నానకు స్వభావమెఱుగని వారందఱు దప్పక యతడు నవాబు ప్రేరణంబుంన దురకలలో గలసెననియే జెప్పుకొనిరి. జయరాముడామాట విన్నప్పుడు చాల