పుట:Nanakucharitra021651mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలిచియుండుటకు వచ్చితివా?" యని యడిగెను. నవాబు ప్రశ్నమునకు నానకు క్రిందియుత్తరము జెప్పెను. "ప్రార్థనసమయమున మీరు గాంధారదేశమున గుఱ్ఱములను బేరము చేయుచుండిరి. అందుచేత నేను మీతో గలసి యెట్లుబ్రాథన్‌నసేయగలను." అనవుడు నవాబుప్రక్కనున్న ఖాజీ నానకుతో నిట్లనియె. "నీవు నవాబుగారితో గలిసి ప్రార్థనము జేయలేనిపక్షమున నాతోగలసి యేలప్రార్థింపవైతివి" అప్పలుకులకు నాన కీవిధమున బదులుచెప్పెను. "మీ తక్కువ యేమున్నది. మీగుఱ్ఱపుపిల్ల మీదొడ్డిలోనున్న బోదెలో బడునేమోయను భయమున మీమనసు ప్రార్థనసమయమున మీ గుఱ్ఱపుపిల్ల వెనుకనే యుండెను. నేనుమీతోగలిసిన మాత్రమెట్లు ప్రాథిన్ంపగలను."

అతనిపలుకులు విని నవాబు వానిగురువు విస్మయమునొంది యొండొరుల మొగంబులు చూచుకొని యెట్టకేలకు తమమనస్సు లాసమయమున నిజముగా మసీదులో లేవనియొప్పుకొనిరట. అన్యుల మనోగతములగు నాలోచనలను విజ్ఞానవంతులు సులభముగ నెఱుంగ గలరని ప్రకృతి శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఇది నిజమో యతిశయోక్తియో మనము చెప్పజాలము. అనంతరము నవాబు నానకును బిలిపించిన కార్యము మరువక ధనమెట్లు వ్యయము సేయవలయునని వాని నడిగెను. ఎన్నివిధముల దరచి యడిగినను నానకు