పుట:Nanakucharitra021651mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈరెండు ధర్మసందేహములు జయరాముని బాధించిన కతమున నతడు నానకునే పిలుపించి కర్తవ్యమునుగూర్చి యడుగమని నవాబునకు విన్నవించెను. నవాబువాని చెప్పినచొప్పున నానకును రమ్మని వతన్‌మాన మంపెను. నానకువానియాజ్ఞ నిరాకరించి రానందున నవాబు వానిని బలవంతముగ దనసన్నిధికి రావించి తనయాజ్ఞప్రకారము రాకుండుటకు గారణమేమని కోపముతో నడిగెను. నానకు వానికిట్లనియె. "నేను మీసేవచేయునప్పుడు మీయాజ్ఞమన్నించి ఇప్పుడు భగవంతునిసేవ చేయుటచే భగవంతుని యాజ్ఞనేమన్నించెద. అప్పలుకులు విని నవాబు "నీవు భగవద్భక్తుండ వయితివేని నేనును భగవద్భక్తుడనే. నేడు శుక్రవారము మసీదునకుబోయి మనమిద్దరము నమాజు చేయుదము ర" మ్మని పలికెను. భగవంతుడు సర్వవ్యాపకుడను నమ్మిక హృదయమున నుండుటచే నానకు మసీదునకు బోవ సమ్మతించె. సమ్మతించుటయు నవాబు కొలువులోనున్న గొప్పసరదారులను స్వమతగురువులను నానకును వెంటబెట్టుకొని వైభవముతో మసీదునకుబోయి ప్రార్థనల నారంభించెను. తురకలందరు దమయాచారప్రకారము ప్రార్థనసమయమున మోకాళ్ళమీదబడియుండ నానకు మాత్ర మట్లుచేయక కాలువంచక నిలచియుండెను. ప్రార్థనలు ముగిసినపిదప నవాబునిలిచియున్న నానకునుజూచి "ఓయి నీవు నాతోగలిసి ప్రాథిన్ంచుటకు వచ్చితివా? లేక