పుట:Nanakucharitra021651mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియుటచేతను నవాబు వానివంతుధనము దానముచేయక యాలు బిడ్డల కీయ బ్రయత్నించెను. నానకు నిరంతరము గీరీలదొడ్డిలో గూర్చుండి జపము సేయుచుండుటచే వానికేదేని యొక దయ్యముపట్టి యుండవచ్చునని కొందరు చెప్పిరి. తురకలకును దయ్యము లున్నవని నమ్మికగలదు. గావున నవాబు తన మతగురువు నొక్కనింబిలిచి మంత్రములు చదివియా దయ్యమును వదలించుమని వానితో జెప్పి నానకు నప్పగించెను. ఆగురువు నానకుకడకుం బోయి తనమంత్రము లన్నియు జదివెను. ఎన్ని మంత్రములు జదివిన నతడెప్పటి యట్లె యుండెను. తురక గురువు నానకుతో నించుకసేపు సంభాషించి వానికి దయ్యము పట్టలేదనియు మతి లేకపోలేదనియు గ్రహించి యామాట నవాబున కెఱిగించెను. పేదలకు బంచిపెట్టవలసిన సొమ్ము మఱియొకలాగున వినియోగించుట మహాపాపమని మహమ్మదీయ ధర్మశాస్త్రములలో నుండుటచే నవాబు పాపభీతినొంది యాధన మేవిధంబున వినియోగింప నగునని జయరామునిం బిలిపించి యాలోచనమడిగెను. జయరాముడెటుచెప్పిన నెటువచ్చునో యని యేయాలోచనముం జెప్పవెరచెను. ఏలయన నానకుయొక్క యాలుబిడ్డల యవస్థజూడధనము వారికప్పగించుటయే న్యాయమని తోచును నానకు మతిలేనివాడుకాడని తెలిసినప్పుడువానిచెప్పిన చొప్పున వానిసొమ్ముదానముచేయక పోవుట యనుచితమని తోచును.