పుట:Nanakucharitra021651mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వప్నమందైన దలంపలేదు. తలచినకొలది కూతురు యొక్కయు మనుమలయొక్కయు నవస్థ విషాదము గలుగ జేయ మూళుడు తనమాట యల్లుడు వినడని యెఱింగి తనపురోహితుని గాంచి నానకు బుద్ధివైరాగ్యమునుండి మరల్చి సంసారమవంక ద్రిప్పుమని యాయననుబతిమాలి పంపెను. ఆపురోహితుడు వల్లెయని బయలుదేరి పోయి శ్మశానమునందు గూర్చుండి యీశ్వరధ్యానము చేయుచున్న నానకునుగాంచి యాలుబిడ్డలను మలమలమాడ్చి సన్యసించుట యనుచితమని యెన్నో తెఱంగుల వాని కుపదేశించెను. కాని వానిమనస్సు నిశ్చలమై యుండుటంజేసి పురోహితుడు వచ్చినదారినే స్వగ్రామమునకు జని యావృత్తాంతము మూళున కెఱింగించెను. అల్లుడు మరల సంసారియగుట యసాధ్యమని గ్రహించి మూళుడు నానకునకు ధాన్యపుదుకాణములో రావలసిన యేడువందల యిరువది రూపాయలు వాని యాలుబిడ్డలకిచ్చి రక్షింపవలయునని నవాబునకు విజ్ఞాపనమంపెను. నవాబు నానకుదారపుత్రుల నిరాధారస్థితికి మిక్కిలి జాలినొందియు నానకుచేత పేదలనిమిత్తము దానమీయబడిన ధనము వాని సమ్మతిలేక యాలుబిడ్డల కిచ్చుట యధర్మమని భయపడి మూళుడు కోరినప్రకారము చేయుట కిష్టపడడయ్యె. అయినను నానకునకు మతిలేదని లోకులు చెప్పుకొనుట చేతను మతిలేనివాడు చేసిన దానధర్మములు పరిగ్రహింప దగినవి కావని