పుట:Nanakucharitra021651mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నానకు చాలకాలము గృహస్థుడై భార్యతో గాపురముచేసి సంతానముంబడసి సంసారబంధములు మఱింత బిగిసినవెనుక వయసు కొంత ముదిరిన పిదప విరాగియై యాలు బిడ్డలవిడచి నిస్పృహుడై భగవధ్యాన పరాయణుడగుట జాలమంది కాశ్చర్యము కలిగించును. కాని యిందాశ్చర్య పడవలసిన దేమియులేదు. ఏలయన నానకుయొక్క గృహస్థాశ్రమము వాని నుత్తమగతి నొందించునట్లే యుండెను. కాని యధోగతికిం దెచ్చునట్టులేదు. అతడు ప్రతిదినము జామురాత్రియుండగా మేల్కొని స్నానముజేసి పరిశుద్ధదేహముతోడను పరిశుద్ధ మనస్సుతోడను భగవధ్యానము చేయుచుండును. భగవంతుడు దయామయుడు సత్యస్వరూపుడు పరిశుద్ధడు నగుటచేత వాని నిర్మలమనస్సుతో ధ్యానించి వారికందఱకు దయా సత్యశౌచములు తమయంతట తామేవచ్చి కరతలామలకములై యుండెను. వారు సంసారమునందుండియు సంసారమున కతీతులు. మనసు వారి యధీనమునం దుండుటచే నుండదలచిన నింత నుండుదురు. వెడలదలంచిన నిర్విచారముగ వెడలుదురు. అదియునుగాక న్యాయార్జితమగు సొంత ద్రవ్యము దినువారి మనస్సు నిర్మలమై పవిత్రమైయుండును. నానకు ధాన్యపుదుకాణమునం బ్రవేశించినదిమొదలు న్యాయాజిన్‌తము స్వాజిన్‌తమునగు ధనమే తినుచుండుటజేసి వానిచిత్తము నిష్కలుసుమైయుండె. మఱియు నతడు ద్రవ్యమును సంపా