పుట:Nanakucharitra021651mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పారిపోయెననియు గడుసువాడగుటచేత నట్లుచేసెననియు నపవాదములు వేయజొచ్చిరి. అట్లు పగతురు చెప్పుకొనుచుండ నేమికారణముననో మరల నానకు మూడవనాడు స్వగ్రామమునకు బోయెను. అతనింజూచి నిరాపనిందలు మోపిన కుత్సితస్వభావులు తమపలుకులు కల్లలయ్యెనని తలవంచుకొనిరి. నానకు చిన్న గోచిమాత్రము పెట్టుకొని దిగంబరుడట్లె యుండె స్వగృహమమునకుగాని సోదరీగృహంబునకుగాని యతడుపోవక యూరకనిందందు దిరుగజొచ్చె. గ్రామవాసులు వానియవస్థ గనుగొని "వానికిమతిలేదు పిచ్చియెత్తినదని కొందఱు దయ్యమేదోపట్టి యట్లు వేధించుచున్నదని కొందఱు బలుకజొచ్చిరి. నానకు హఠాత్తుగ నదృశ్యుడయ్యెనని విని నవాబు వానికి బూటకుడగు జయరామునింబిలుపించి లెక్కలు పరిక్షచేయింపుమని యానతిచ్చెను. జయరాముడు నానకును గూడ వెంటబెట్టుకొని నవాబువద్దకు బోయెను. లెక్కలు మూడవసారి పరీక్షింపబడెను. కాని కడచిన రెండుసార్లవలెనే నానకు నిర్దోషియని తేలుటయేగాక యతని వంతు రు 760 లు రావలసి యుండెను. పరీక్షానంతరము నవాబు నానకు న్యాయబుద్ధికి సంతోషించి మరల దనవద్ద నుండుమని యడిగెను. నానకు తనకుద్యోగమక్కరలేదని తనకు రావలసిన ధనము పేదలకు బంచిపెట్టమని చెప్పెను.