పుట:Nanakucharitra021651mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్ఘాలోచనము చేయుచుండ వానివద్దకొక పకీరు వచ్చెను. ఇరువురు గొంతసేపు భగవద్విషయకమైన చర్చచేసిరి. ఆసంభాషణము ముగిసినవెనుక పకీరు నానకుతో నిట్లనియెనట. "నానకూ! నీవు చేయుచున్న పనియేమి? నీజీవితముయొక్క పరమార్థమిదియేనా? నీవు చేయవలసిన యుత్కృష్టకార్యమునకు నీవిప్పుడు గడుపుచున్న దేహయాత్ర యనుకూలమై యున్నదో లేదో చూచుకొనుచున్నావా?" ఆపలుకులు నానకు మనస్సుమీద నెంతో పనిజేసివానిని విరక్తిమాగన్‌మునకుం ద్రిప్పెను. త్రిప్పుటయు నతడు పకీరుతో నిట్లనియెనట. "భగవంతుడంతయు సరిగా వచ్చునట్లె నడపించును" ఆపలుకులు పలుకునప్పుడు నానకు మనసారా నేదోచేయుటకు గృతనిశ్చియుడైనట్లు కనబడెను. అదిగ్రహించి పకీరు సంతసించి తనదారిం బోయెను.

ఆపకీరుతో బ్రసంగముజరిగిన యెనిమిదిమాసముల కొకనాడు తెల్ల వారుజామున నానకు దాపుననున్న యేటి కెప్పటియట్ల స్నానమునకుబోయి తిరిగి గృహమునకురాక యదృశ్యుడయ్యెను. అతని యదృశ్యత యాలుబిడ్డలకు సోదరీ భావుకలకు జాల భయముగలిగింప వారు వానినిమిత్తము గ్రామము పొలిమేరలు వెదికించిరి. కాని యతండెందుం గానబడడయ్యె. ఆయనను గనిపెట్టి వానికి గిట్టనివారు నానకు నవాబుసొమ్ము హరించి యాపదవచ్చునను భయమున నెక్కడికో